|
|
హార్ట్‌లాకర్‌కు అవార్డుల పంట- 82వ నామినేట్ అయినప్పటికీ ఈసారి ఆయన అవార్డును సొంతం చేసుకోగలిగారు. అవార్డు అందుకున్న క్షణంలో ఆయన భాగోద్వేగానికి గురయ్యారు. ఈ విజయానికి కారణమైన తన తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు సాధించడం వారికి తానిచ్చిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు సహ నటీనటులకు సాంకేతిక బృందానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సహచరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ది బ్లైండ్‌సైడ్ చిత్రంలో కనబర్చిన అత్యుత్తమ నటనకు గానూ శాండ్రాబులక్ ఉత్తమ నటీ విభాగంలో ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. జెఫ్‌కు జార్జిక్లానీ, మోర్గాన్‌ఫ్రీమెన్, జర్మీరెన్నర్‌ల నుంచి పోటీ ఎదురైంది. ఉత్తమ నటుడు జెఫ్ బ్రిడ్జెస్ ఉత్తమ నటీగా అవార్డు అందుకున్న కేట్‌విన్సెలట్ ఈ ఏడాది ఆస్కార్ అవార్డును అందించింది.
ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో ఆస్ట్రేలియా నటుడు క్రిస్టోఫ్ వాల్ట్జ్ ఆస్కార్ అవార్డు పొందారు. ఈ అవార్డును పెనిలోప్‌క్రూజ్ ఆయనకు అందజేశారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్స్ కేటగిరిలో క్రేజీహార్ట్ గెలుచుకుంది. ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో సిహార్ట్‌లాకర్ చిత్రానికి గానూ మార్క్‌బాబోల్ గెలుపొందారు. ఉత్తమ యానిమేషన్ చిత్రంగా అప్, ఉత్తమ మేకప్‌కు గానూ కార్‌ట్రెక్ చిత్రానికి పని చేసిన బ్యార్నీబర్మన్ ఆస్కార్ అవార్డులను గెలుపొందారు.
హార్ట్‌లాకర్: ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, బెస్ట్‌ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే.
అప్: రెండవ ఉత్తమ చిత్రం, ఉత్తమ యానిమెటేడ్, ఫ్యూచర్‌ఫిలీం.
అవతార్: ఉత్తమ సినిమా ఆటోగ్రఫీ, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ విజువెల్ అఫెక్ట్స్.
ఫిషియేస్: ఉత్తమ సహాయ నటి మోనిక్. |
|