ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

ఎగిసిపడుతున్న అలలుఆందోళనలో ప్రజలు

గడిపారు.కాకినాడ, ఉప్పాడ బీచ్‌ వద్ద మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగిసిపడ్డాయి. బీచ్‌ రోడ్డును తాకుతూ సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలోనూ సముద్ర కెరటాలు భయోత్పాతాన్ని రేకెత్తిస్తున్నాయి. తీర ప్రాంతంలోని రొయ్యల చెరువుల్లోకి సముద్రం నీరు దూసుకొస్తుంది. దీంతో చెరువులు సముద్రం నీటితో నిండిపోయాయి. తీర ప్రాంత గ్రామాలైన బియ్యపు తిప్ప, తూర్పుతాల్ళు, పేరుపాలెం, కెపిపాలెం వంటి గ్రామాలలో సముద్ర కెరటాల ఉధృతి భయం కలిగిస్తోంది. నర్సాపురం ఆర్డీవో వెంకటసుబ్బయ్య అక్కడి పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. దాదాపు 25వేల మందిని అవసరమైతే పరిస్థితి తీవ్రత దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. నర్సాపురం రూరల్‌ ప్రాంతంలో ఉన్న 15 తుఫాను షెల్టర్లను వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. అయితే గత వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళేందుకు అనువైన వాతావరణం లేకపోయింది. ఇప్పటికీ మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్ళకుండా అధికారులు ఆంక్షలు విధించారు. దాంతో మత్స్యకారులు తమకు తిండితిప్పలు లేకుండా పోయాయని ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ యంత్రాంగం నుంచి వారికి ఎటువంటి సహకారం అందడం లేదు. మత్స్యకార కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters