ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More
 

పావులు కదుపుతున్న జగన్‌ వర్గం

నిలుస్తున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను జగన్‌ వైపు ఆకర్షించేలా మంతనాలు సాగిస్తున్నారు. జగన్‌ శిబిరం కార్యకలాపాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్లాస్‌మెంట్‌ డాక్టర్‌ వేగిరాజు రామకృష్ణంరాజు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా పరిణామాలను ఆయన సమీక్ష జరుపుతున్నారు. మరోవైపు అత్తిలి మాజీ ఎమ్మెల్యే చరకువాడ శ్రీరాంగనాథరాజు జగన్‌ పార్టీ వైపు వలసలు ప్రోత్సహించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్‌ ఆర్‌ పట్ల సానుభూతితో జగన్‌ పట్ల అభిమానం చూపే నేతలు ఎవరన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి వైపు దృష్టిపెడుతున్నారు.
అవసరమనుకుంటే అలాంటి వారి వద్దకు వెళ్లి నేరుగా చర్చించడం జరుగుతోంది. మరికొందరితో ఫోన్‌ల ద్వారా మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనానితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాబోయే కాలంలో జగన్‌ పార్టీలోకి రావడం ఖాయమని భరోసా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఇప్పటికప్పుడు జగన్‌ వైపు రావాలని ఒత్తిడి పెంచకపోయినా వారి అనుచరులు మాత్రం దశల వారీగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాలు చేసేలా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. దాంతో పార్టీ కేడర్‌ను చేజారనీయకుండా జాగ్రత్తలు పడే పరిస్థితి కాంగ్రెస్‌కు అనివార్యంగా మారింది.
ఈ క్రమంలోనే గురువారం ఏలూరులో కాంగ్రెస్‌ జిల్లా సమన్వయ కర్త కుసుమకుమార్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. మరోవైపు విజయవాడలో ఈనెల 21, 22 తేదీల్లో జగన్‌ తలపెట్టిన నిరాహారదీక్షకు జిల్లా నుండి జన సమీకరణ చేసే విషయమై శుక్రవారం జగన్‌ వర్గం నేతలు తాడేపల్లిగూడెంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం నిర్వహించబోతున్నారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters