ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

ఉద్యోగులపై లాఠీఛార్జీని ఖండించిన టీడీపీ: పయ్యావుల

విలేఖరులతో మాట్లాడారు. ఇందిరాక్రాంతి పథం ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళనలు చేపడితే పోలీసులు వారిపై విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేశారని అన్నారు. ఉద్యోగుల సర్వీసు, క్రమబద్దీకరణలో అర్హత కలిగిన వారిని వదిలి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారినే క్రమ బద్దీకరింస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టడం తుగ్లక్‌ పాలనను జ్ఞప్తికి తెస్తుందని అన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా అనవసరపు నిబంధనలు వదిలి ఇందిరాక్రాంతి పథంలోని ఉద్యోగుల సర్వీసులను క్రమ బద్దీకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌సిఐ నిబంధనలను సడలించాలని కూడా ఆయన సూచించారు. కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుల వైఫల్యంతోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఆరుగురు ఉన్నా, రైతులకు ప్రయోజనం మాత్రం సున్నా అని అన్నారు. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో డబ్బు కూడబెట్టిన దివంగత నేత వై.ఎస్‌.ఆర్‌. కుటుంబంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్‌ కృష్ణా నదిలో స్నానం చేసి నదిని అపవిత్రం చేశాడని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విమర్శించే హక్కు జగన్‌కు ఏ మాత్రం లేదని దేవినేని అన్నారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters