ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More
 

రబీలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు

ప్రభావిత మండలాలుగా గుర్తించి, ఇప్పటికే జీఓ జారీ చేశామన్నారు. డిసెంబరులోని తుపానుకు గురైన మరిన్ని మండలాలను అధికారులు లెక్కిస్తున్నారని, వాటి వివరాలు త్వరలో అందనున్నాయన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని రైతులందరి రుణాలను రీ షెడ్యూలు చేస్తున్నామన్నారు. రానున్న రబీ పంటకు వారిందరికీ సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. అర్హులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పారు. అలాగే విపత్తు సందర్భంగా సహాయక చర్యలు చేపట్టడానికి ప్రస్తుతం చెన్నయ్‌ నుంచి బృందాలను రప్పిస్తున్న విషయం తెలిసిందేనని.. అయితే గుంటూరు జిల్లామంగళగిరివద్ద బెటాలియన్‌ కేంద్రంఏర్పాటు చేస్తే బాగుంటుందన్న మర్రి శశిధర్‌రెడ్డి సూచనమేరకు చర్యలు తీసుకున్నామన్నారు. 1500 మందికి ట్రైనింగ్‌ ఇచ్చేందుకుగాను 50 ఎకరాలు కేటాయించామని, అయితే వారు ఇంకో 20 ఎకరాలు అడిగారని, అవికూడా ఇస్తామన్నారు. అలాగే250 కోట్లు నిధులు ఇవ్వనున్నట్టు చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి విపత్తు నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వరకు ఒక ప్రత్యేకమైన కోర్సును ప్రవేశపెడుతున్నామన్నారు. డిసెంబరు వర్షాల వల్ల రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ ఎస్‌సిఐతోను, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోను సంప్రదిస్తున్నారన్నారు. రెండు రోజుల్లో ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళుతున్నారని, కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను కోరుతారన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోడానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.508.84 కోట్లు కేటాయించారని, అయితే ప్రభుత్వంమాత్రం విపత్తును ఎదుర్కోడానికి రూ.1,578.83 కోట్లు విడుదల చేసిందన్నారు. తమది రైతు ప్రభుత్వమని.. రైతు ప్రభుత్వంగానే కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 లక్షల హెక్టార్లలోని పంట నాశనమైనట్టు అంచనా వేశామన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ప్రత్యేక బృందం రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తుందన్నారు. ఆయన ప్రసంగాన్ని సభ్యులు మధ్యలో అడ్డుకున్నప్పటికీ ఓపిగ్గా ఉండాలని.. అడ్డుపడొద్దంటూ అంటూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. పంటలకు బీమా అందించేందుకు గ్రామాలను యూనిట్‌గా తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ బీమా ప్రవేశపెట్టే యోచన ఉందన్నారు. మిర్చి, కాటన్‌, అపరాలకు సర్వే నంబరు లెక్కన బీమా అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో వరి మద్దతు ధర 550రూపాయలుండేదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వాల వల్ల 1030 రూపాయలకు చేరిందన్నారు. రాబోయే సంవత్సరంలో మరింత పెంచుతామని ప్రకటించారు. కౌలు రైతుకు అన్ని విధాగా నష్టానికి గురవుతున్నారని, వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. కౌలు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ పథకాన్ని మూడేళ్ల క్రితం ప్రారంభించామని గుర్తు చేశారు. కౌలు రైతులను గుర్తించేందుకు.. వారికి అన్ని విధాలా సాయపడేందుకు ఇప్పటికే ఒక ప్రొఫార్మా రూపొందించామని, దాన్ని అధికారులకు ఇచ్చి వారి వివరాలను నమోదు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు.
వడ్డీలు మాఫీ : సిఎం కిరణ్‌
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రోశయ్య హయాం నుంచి ఇప్పటివరకు అంటే 15 మాసాల్లో అయిదుసార్లు వర్షాలు, వరదలు, లైలా, జల్‌లల వల్ల రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఇది అత్యంత శోచనీయమన్నారు. రైతులకు ప్రతి ఒక్కరం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ధైర్యంగా ఉండండి.. తప్పకుండా ఆదుకుంటామన్న భరోసాను రైతుల్లో కలిగిద్దామన్నారు. అధిక నిధుల కోసం ఇప్పటికే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశానన్నారు. రెండు రోజుల్లో ఢిల్లీ వెళుతున్నానని.. అప్పుడు కూడా కలిసి సాయం త్వరగా అందించాలని కోరుతానన్నారు. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌పవార్‌ను కూడా కలిసి రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండు చేస్తామన్నారు. ఇప్పటివరకు 483 మండలాలను గుర్తించామని, ఇటీవల కురిసిన వర్షాలకు మరిన్ని మండలాలు గురయ్యాయని, వాటి వివరాలు అందాల్సి ఉందన్నారు. తాము పదవిచేపట్టిన పదిహేను రోజుల్లోనే పెండింగ్‌లో ఉన్న రైతులకు అందాల్సిన 685 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. గ్రామాల్లోని బాధిత రైతులను, కౌలు రైతులను జాగ్రత్తగా గుర్తించాలని కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలిచ్చామని, ఎక్కడైనా పొరపాటు జరిగితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించామన్నారు. తమది రైతు ప్రభుత్వమని.. వైఎస్‌ఆర్‌ 2004, మే లో పదవి చేపట్టగానే తొలి ఫైలుపై సంతకం చేసినప్పటి నుంచి తమది రైతు ప్రభుత్వంగా కొనసాగుతోందని.. కొనసాగిస్తామని అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. విపత్తు ప్రభావిత గ్రామాల్లోని వరి, శెనగ, పత్తి, చెరకు, ఉల్లి పంటల రైతులకు నష్టపరిహరం కింద హెక్టారుకు 6వేల రూపాయలు ఇస్తామన్నారు. వాటిల్లో కేంద్రం నాలుగు వేలు ఇస్తుందని, తాము అదనంగా మరో రెండు వేలు ఇస్తామన్నారు. గేదె, ఆవులు కోల్పోయిన వారికి పదివేలకు గాను పదిహేను వేలు అందిస్తామన్నారు. చేనేత కార్మికులకు మగ్గాల నష్ట పరిహరం కింద అయిదు వేల రూపాయలిస్తామని ప్రకటించారు. నష్టపోయిన నూలుకు 5వేలు ఇస్తామన్నారు. అలాగే మత్స్యకారులకు నాటు పడవలు, వలలకు నష్టపరిహరంగా 5వేల రూపాయలు ఇస్తామని అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గత పదిహేను నెలల్లో అయిదుసార్లు వర్షాలకు, వరదలకు, తుపానుకు నష్టపోయిన రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. రుణాలను రీ షెడ్యూలు చేయాలని బ్యాంకులకు ఆదేశాలిచామని చెప్పారు. రోడ్ల మరమ్మతులకు వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. వాటిని ఆర్‌ అండ్‌ బి శాఖకు, పంచాయతీరాజ్‌కు అందజేస్తామన్నారు. తమకు ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశం ఉన్నంత మేరకు సాయమందించామని, రానున్న రోజుల్లో రైతులకు మరింత సాయం అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రైతులకు చేదోడుగా నిలవాలని రైసుమిల్లర్లను కోరామని.. వారిని ఇబ్బంది పెట్టే రైసుమిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. అందరికీ రెండు విషయాలు చెప్పదలుచుకున్నా.. రాజకీయాలు తక్కువ మాట్లాడుకుందాం.. రైతుల గురించి ఎక్కువ చర్చిద్దాం. రైతులు బాగుంటేనే.. మనమందరం బాగుంటాం.. దయచేసి అందరూ సహకరించండి.. రైతులను ఆదుకుందాం.. అండగా నిలుద్దామంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
రైతులకు ఉపయోగపడవు : చంద్రబాబు
ముఖ్యమంత్రి కిరణ్‌ చేసిన ప్రకటనలు రైతులకు మేలు చేకూర్చవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చరిత్రలో లేని విపత్తు వచ్చొంది.. ఈ ఏడాది ఖరీఫ్‌లో అయిదు పర్యాయాలు రైతులపై దెబ్బ మీద దెబ్బ పడింది.. 62 లక్షల ఎకరాల్లోని పంట దెబ్బతిన్నట్టుగా ప్రభుత్వాధికారుల లెక్కల వల్ల తెలిసింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌కు లేఖ రాశాను. ముఖ్యమంత్రి ఇన్సూరెన్సు గురించి నోరు మెదపలేదు. మూడు సంవత్సరాలుగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. పైగా చప్పట్లు కొట్టుకుంటున్నారు. తాము ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండు చేశాం. ఆరు వేలు ఏమాత్రం సరిపోవు. స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు.. జలయజ్ఞం చేపట్టి ధన యజ్ఞంగా మార్చారు. రైతులను ఆదుకోడానికి మాత్రం వెనుకడుగేస్తున్నారు. వరిని నష్టపోయిన రైతులకు పదివేలు అందించాల్సిందే. విపత్తు వచ్చింది.. కేంద్రం నిద్రపోతోందా.. 33 మంది ఎంపీలు ఉన్నా వారేం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కౌలు రైతులకు నష్టపరిహరం పూర్తిగా అందించాలి. రైతులు అమ్మాక ఎఫ్‌సిఐ ఛైర్మన్‌ వచ్చి ఏం చేస్తారో తెలీదు. సరిపడినన్ని గోడౌన్లు లేవు. ఆ మాటే ఎవరికీ పట్టదు. విపత్తుకు గురైన పలు జిల్లాల్లో పర్యటించా. ముఖ్యమంత్రి మాత్రం ఆకాశంలో చక్కర్లు కొట్టారు. ఆయన వచ్చి పదిహేను రోజులే అయినందున నేనెక్కువ మాట్లాడను. రైతు ప్రభుత్వం అని మాత్రం చాటుతారు. వైఎస్‌ హయాంలో రైతుకు రోజుకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు. అది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. చేనేత కార్మికులకు 50 కిలోలు బియ్యం, 10లీటర్ల కిరోసిన్‌ ఇవ్వాలి. రైతులను ఆదుకోవడం కోసం రమ్మంటే ఢిల్లీకి వస్తాం. వారిని నిలతీద్దాం. ఆదుకునే వరకు పోరాడుదాం. రైతులకు తగిన నష్టపరిహరం ఇవ్వకపోతే గురువారం రాత్రి నుంచి నిరాహారదీక్ష చేపడతా. మీలో మార్పు రావాలి. మీ అజెండా మార్చుకోవాలి. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రినవుతా. అప్పుడు రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టి ఆదుకుంటా.. అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters