ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More
 

మహాగర్జన గులాబీమయం సభకు భారీ ఏర్పాట్లు

వాయిదా వేశారు. నెలరోజులపాటు శ్రమించి వేయి ఎకరాల స్థలంలో ఈ మహాగర్జనకు ఏర్పాట్లు చేసారు. సుమారుగా 2500వలంటీర్లు, 3500మంది పోలీసులు, ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, 11మంది డిఎస్పీలు, 31మంది సిఐలు, 194మంది ఎస్‌ఐలు, 192మంది ఏఎస్‌ఐలు, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు, మెటల్‌ డిటెక్టర్లు భద్రతా చర్యల దృష్ట్యా భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. నగరంలోని సభా ప్రాంగణానికి దారితీసే రోడ్లన్నింటిలోనూ పార్టీ జెండాలు , బ్యానర్లను అలంకరించారు. ఏయే మార్గంలోని వాహనాలు ఎక్కడెక్కడ పార్కింగ్‌ చేయాలనే దానిపై సూచిక బోర్డులను ఏర్పాటు చేసారు. సుమారుగా 15 నుంచి 25 లక్షల మంది వరకూ హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తుండగా దానికి తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తిచేసామని నేతలు పేర్కొన్నారు. మెడికల్‌ క్యాంపులు, వైద్యసేవలు, అంబులెన్సుల సౌకర్యాలు సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసారు. సభకు వచ్చిన వారి కోసం మధ్యమధ్యలో వాటర్‌ ప్యాకెట్లను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసారు. ముఖ్యంగా సభా వేదికను 10 అడుగుల ఎత్తులో ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా తీర్చిదిద్దారు. అంతేగాకుండా సభా వేదికపై సుమారుగా 200మంది కూర్చునేందుకు వీలు కల్పించారు. వేదికపై నేతల ప్రసంగాన్ని దూరం కూర్చొని ఉన్న ప్రజలు వీక్షించలేరు కాబట్టి, 11 భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి వాటిలో లైవ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. సభా ప్రాంగణం నుంచి హన్మకొండ కూడలి వరకూ సుమారుగా ఐదు కిలోమీటర్ల వరకూ మైక్‌లను ఏర్పాటు చేసారు. తరలివచ్చే ప్రజలకు ఈ మైకుల ద్వారా పలు సూచనలు, సలహాలు కూడా చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. సభ రాత్రిపూట జరుగుతున్నందున రెండు వేల లైట్లను ఏర్పాటు చేసారు.
కాగా, మహాగర్జనకు వచ్చిన ప్రజలతో సభా ప్రాంగణమే కాకుండా సుమారుగా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. అంతేగాకుండా హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సభకు హాజరయ్యేందుకు హూజురాబాద్‌ నుండి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ కాలినడకన కార్యకర్తలతో తరలివస్తుంటే, సిద్దిపేట హారీష్‌రావు ఊరేగింపుగా వస్తున్నారు. కె.తారకరామారావు వెంట స్వామిఅగ్నివేష్‌ సభకు వెళ్ళారు. జైబోలో తెలంగాణ చిత్రయూనిట్‌ కూడా సభకు హాజరైంది. పద్మాదేవేందర్‌రెడ్డి సభకు హాజరయ్యేందుకు వెళుతుండగా ట్రాఫిక్‌లో చిక్కుకొని కాసేపు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. టీడిఎఫ్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు కూడా సభకు వచ్చారు. వరంగల్‌లోనే కాకుండా, తెలంగాణ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు స్వచ్చందంగా సెలవులు ప్రకటించాయి. దీంతో కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులంతా సభకు హాజరుకాగా యూనివర్సిటీ నిర్మాణుష్యంగా మారింది. వరంగల్‌లోని పలు గ్రామాలకు గ్రామాలే సభకు తరలివచ్చాయి. గ్రామాల్లో ఇళ్ళకు తాళాలు వేసి మరిప్రజలు వచ్చారు. మొత్తం మీద కనీవినీ ఎరుగని రీతిలో సభకు తెలంగాణ వాదులు హాజరయ్యారు. దేశంలోనే ఇంతపెద్ద సభ ఎప్పుడూ, ఎక్కడా జరగలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters