ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలో గత 12 రోజులుగా జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలు శుక్రవారంతో ముగిశాయి. గత పన్నెండు రోజులుగా జిల్లాలోని తోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, వేమనపల్లిలోని తుమ్మిడిహెట్టి ఘాట్‌లలో సుమారు ఏడు లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తూ చివరి రోజైన శుక్రవారం ముక్కోటి ఏకాదశి కూడా కలిసిరావడంతో భక్తుల సంఖ్య తీవ్రంగా పెరిగింది. నేడు 12గంటల వరకూ పుణ్యముహూర్తం ఉండడంతో సూర్యోదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పుష్కరఘాట్‌లన్నీ నిండిపోయాయి. పుష్కర ఘాట్‌లలో భక్తులు పుష్కర స్నానాలు గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా భక్తుల సంఖ్య పెరగడంతో ఈ ప్రాంతాలలో ట్రాఫిక్‌ పూర్తిగా జాం అయింది. జిల్లాలోని మారుమూల మండలమైన తోటపల్లి, వేమనపల్లి మండలాల్లో రోడ్ల సౌకర్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా పుష్కరాలను నిర్వహిస్తున్నామని ప్రకటించినప్పటికీ అందుకు తగ్గ నిధులు మంజూరు చేయకపోవడంతో సౌకర్యాలను అధికారులు కల్పించలేకపోయారు. జిల్లాలోని వివిధ శాఖల్లోని నిధులను మళ్ళించి పుష్కర పనులను చేపట్టారు. నిధులు కూడా ఏమాత్రం సరిపోకపోవడంతో పనులు పూర్తికాక ఇక్కడికి వచ్చిన భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలకు ప్రభుత్వ పరంగా పూర్తి ఏర్పాట్లు చేయలేకపోయారు. మళ్ళీ 2022 సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో పుష్కరాలు రానున్నాయి.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters