ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

తెలంగాణతోనే తమకు న్యాయం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): సమస్యలకు మూలకారణమైన సమైక్యాంధ్రను విడదీసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తప్ప తమకు న్యాయం జరగదని ఎస్టీ హాస్టల్‌ విద్యార్థులు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు శుక్రవారంనాటికి 43వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో విద్యార్థులు అశోక్‌, మనోజ్‌కుమార్‌, విజయ్‌కుమార్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు వరకూ తమ ఉద్యమం ఆగదని వారు స్పష్టం చేసారు. నాలుగు కోట్ల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేసారు. వరంగల్‌ మహాసభలో 25లక్షల మంది పాల్గొని తమ ఆకాంక్షను తెలిపారని, దీన్ని ప్రాతిపదికన తీసుకొని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించిన మేరకు పనిని మొదలు పెట్టాలని సూచించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తరువాత భవిష్యత్‌ పోరాట కార్యాచరణను రూపొందిస్తామని వారన్నారు. తెలంగాణను అడ్డుకుంటే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటామని వారు స్పష్టం చేసారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters