ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

పత్తి రైతుకు నిరాశ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): ఈ ఖరీఫ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న పత్తి రైతాంగానికి నిరాశే ఎదురయింది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు స్థానిక పంట అయిన పత్తిని సాగు చేస్తూ వస్తున్నారు. కొనుగోళ్ళ ప్రారంభంలో పత్తి క్వింటాలుకు రూ.4500లు పలుకగా, ఇప్పుడు పత్తి క్వింటాలుకు రూ.3600 ధర పలికింది. ఈ ఖరీఫ్‌లో వర్షాల కారణంగా పత్తి దిగుబడి తగ్గిపోవడం అంతర్జాతీయ స్థాయిలో పత్తి డిమాండ్‌ ఏర్పడడంతో పత్తికి రూ. 5వేలు ధర పలుకుతుందనుకున్న రైతాంగానికి రోజురోజుకు ధరలు తగ్గుతుండడంతో తీవ్రంగా నిరాశను వ్యక్తం చేస్తున్నారు. పత్తి ధర నిలకడగా లేకపోవడం ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ పత్తి కొనుగోళ్ళు సరిగ్గా చేపట్టకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను ఇష్టారాజ్యంగా ఇవ్వడంతో గత్యంతరం లేక రైతులు పత్తిని అమ్ముకుంటున్నారు. రైతు ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్‌, రైతు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోయారు. గత 3,4 సంవత్సరాలుగా కరవుతో అల్లాడుతున్న రైతాంగానికి ఈ ఏడాది పత్తికి ఐదువేలు లభిస్తుందని ఆశించిన రైతాంగానికి పత్తి ధర దిగిపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి ధరలపై ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters