ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం

అధ్యక్షుడు చంద్రబాబు ఉద్ఘాటించారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారంనాడు ఆయన ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్షను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలు పూర్తిగా కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ధైర్యం కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా అవసరమైన రీతిలో స్పందించలేదని ఆయన విమర్శించారు. విధిలేని పరిస్థితుల్లో రైతుల కోసం ఈ దీక్షను చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. రైతులే గాక కౌలుదారులు కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలకు తీవ్రంగా నష్టపోయా రని, వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఆహారభద్రతకు ముప్పు లేకుండా ఉండాలంటే రైతు పెట్టిన పెట్టుబడికి నష్టం లేకుండా కనీసం 50శాతం అదనంగా ఆదాయం వస్తేనే గాని వ్యవసాయం మనుగడ సాగించలేదని, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీయే ప్రభుత్వానికి సూచించిం దని చెప్పారు. అలాగే జయతీఘోష్‌ కమిషన్‌, స్వామినాథన్‌ కమిషన్‌ కూడా రైతు సంక్షేమం కోసం, వారి మనుగడ కోసం ఎన్నో సిఫారసులు చేసిందని, వాటిని అమలు చేయని పక్షంలో రైతు మనుగడ కష్టం అవుతుందని చంద్రబాబు అన్నారు. వైపరీత్యాల సమయంలో వరి పంటకు ఎకరానికి రూ.10,000, వాణిజ్య పంటలకు 15,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా మద్దతు ధరకు బోనస్‌గా 200 రూపాయలు చెల్లించాలని కోరారు. మిరప, పొగాకు, పత్తి, చెరకు, కూరగాయల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరేగాక వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమగా ఉన్న చేనేత రంగం కూడా తీవ్రంగా దెబ్బతిందన్నారు. చేనేత కార్మికులు, మత్స్యకారులు, పశువుల కాపరులు, కుల, చేతివృత్తులు, వ్యవసాయ కూలీలను కూడా ప్రభుత్వం అదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటూ రైతుకు ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వ విధానాలు మారాలని చంద్రబాబు డిమాండు చేశారు. దీర్ఘాకాలంలో రైతు ప్రయోజనాలు ఒనకూరి వారికి మేలు జరిగే రీతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాజకీయ పార్టీలు తమ తమ ఎజెండాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ దిశలో జాతీయ స్థాయిలో ఇందుకోసం తాము పోరాటం సల్పుతామని చంద్రబాబు చెప్పారు. రైతులకు మేలు జరిగి వ్యవసాయ రంగం లాభసాటిగా ఉండేందుకు ప్రభుత్వాల విధానాల్లో మార్పు రావాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు. ఇందుకోసమే తాను రాజకీయాలకు అతీతంగా నిర్ధిష్టమైన విధానాలతో గాంధీజీ మార్గంలో శాంతియుతంగా తన నిరసనను తెలియజేస్తున్నానన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన నిర్ణయాన్ని అంతా సమర్థిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. విద్యావంతులు, యువకులు, విద్యార్థులు అంతా కలిసి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎవరికి తోచిన విధంగా వారు శాంతియుతంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఒక నూతన అధ్యయనానికి నాంది పలకాలని కోరారు. నూతన అధ్యాయంలో రైతులకు సమానత్వం రావాలని ఆకాంక్షించారు. అందుకే తెలుగుదేశం చేపట్టిన పోరాటానికి సంఘీభావం తెలుపుతూ సమైక్యంగా మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సున్నితమైన, ఇబ్బందికరమైన, న్యాయమైన సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు తాను చేస్తున్న ఈ దీక్షను నిండు మనస్సుతో ఆశీర్వదించి జయప్రదం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters